సమయానికి రాకపోతే చర్యలు తప్పవు..
Ens Balu
2
జి.మాడుగుల
2020-11-27 17:00:46
గ్రామసచివాలయాలకు సిబ్బంది సమయానికి వచ్చి ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పాడేరు ఆర్డీఓ కె.లక్ష్మీశివజ్యోతి ఆదేశించారు. జి.మాడుగుల మండలం బీరమ్ గ్రామ సచివాలయాన్ని శుక్రవారం రెవెన్యూ డివిజనల్ అధికారిణి ఆకస్మికంగా తనిఖీచేసారు. ఈ తనిఖీ లో భాగంగా సిబ్బంది హాజరు పట్టిక, మరియు ప్రతీరోజు కార్యాలయానికి వస్తున్నదీ లేనిది వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల సచివాలయ సేవలు ప్రజలకు అందించాలని ఆమె తెలిపారు.ప్రతీరోజు సచివాలయానికి హాజరు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామంలోని ప్రజలకు సచివాలయానికి వెళితే తమ సమస్యపరిష్కారం అవుతుందనే భరోసాను కల్పించాలన్నారు అనంతరం నుర్మతి గ్రామంలో పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాడేరు శాసన సభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్.డి.ఒ., అటవీశాఖ సిబ్బంది, మరియు రెవెన్యూశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.