లేవుట్ పనులను సత్వరం పూర్తిచేయాలి..


Ens Balu
3
విశాఖ రూరల్
2020-11-27 18:58:41

పేదలందరికీ ఇళ్లు పథకంలో ఇల్లులేని నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఇళ్ల లే అవుట్ ల పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టరు వి.వినయ్ చంద్  అధికారులను ఆదేశించారు. శుక్రవారం  కశింకోట మండలం కశింకోట, ఎలమంచిలి మండలం మర్రిబంద, షేక్ ఆలీపాలెం గ్రామాలలో  ఇళ్ల పట్టాల లేఅవుట్ ల పురోగతిని కలెక్టరు తనిఖీ చేశారు. కశింకోటలో ఎ.8-86సెం. భూమిలో 305 మంది లబ్దిదారులకు, మర్రిబంద గ్రామంలో ఎ.8-86సెం. ఎలమంచిలి మున్సిపాలిటీకి చెందిన389 మంది లబ్దిదార్లకు షేక్ ఆలీపాలెంలో ఎ.1-57సెం. భూమిలో 55 మంది లబ్దిదార్లకు పట్టాలు అందించడానికి గాను లేఅవుట్లు అందరికీ అనుకూలంగా వుండేలా, త్వరగా పనులను పూర్తిగా వించాలని అధికారులను ఆదేశించారు.  స్థలంలో వున్న తుప్పలను తొలగించి, చదును, శుభ్రం చేయించాల్సిందిగా ఉపాధి హామీ క్రింద పనుల ను చేయించాలని డ్వామా ఎపిడిని ఆదేశించారు.     
సిఫార్సు