సచివాలయాలను త్వరితగతిన పూర్తిచేయాలి..
Ens Balu
5
Yalamanchili
2020-11-27 19:08:26
గ్రామసచివాలయ భవన నిర్మాణాలను త్వరతి గతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎలమంచిలి మండలం పులపర్తి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని సందర్శించారు. ఎలమంచిలి మండలంలో షేక్ ఆలి పాలెం గ్రామ సచివాలయ నిర్మాణపు పనులను పరిశీలించారు. భవనాల పురోగతిని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లే అవుట్ పనుల పురోగతిపై రెవెన్యూ , మున్సిపల్ శాఖాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిమెంట్ స్టాకును పరిశీలించారు. పులపర్తి గ్రామంలో కలెక్టరు సచివాలయ సిబ్బందిని, ఎఎన్ఎం, వెల్ఫేర్ అసిస్టెంట్ లను విధి నిర్వహణపై ప్రశ్నలు అడిగారు. ఇంటింటి సర్వే చేసి ఆరోగ్యశ్రీ లబ్దిదారులను గుర్తించాలని ఆదేశించారు. మహిళా సంరక్షణ సహాయకులను, ఇతర ఉద్యోగులను వారి శాఖకు సంబంధించిన విధులపై ప్రశ్నించారు. సిబ్బంది ప్రజా సమస్యలను అర్ధంచేసుకొని పరిష్కరించడంతో చొరవచూపాలాన్నారు. ఆరోగ్యసిబ్బంది సచివాలయ పరిధిలోని ప్రజల ఆరోగ్యంపై ద్రుష్టిసారించాలని ఆదేశించారు.