కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
Ens Balu
4
Payakaraopeta
2020-11-28 11:19:51
పాయకరావుపేట నియోజకవర్గంలోని సత్యవరం నుంచి మాసాపేట రోడ్డుకి రూ. 1.50 కోట్లు తాను ప్రత్యేంగా నిధులు మంజూరు చేశానని ఎమ్మెల్యే గొల్లబాబూరావు స్పష్టం చేశారు. శనివారం పాయకరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, 2019 ఎన్నికల్లో తాను సత్యవరం, మాసాపేట గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రోడ్డుకి నిధులు మంజూరు చేస్తే..దానికి ఎవరో నిధులు మంజూరు చేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలకు తెలియాలనే తాను ఈ విషయాన్ని ప్రత్యేంగా చెబుతున్నానన్నారు. సత్యవరం నుంచి మాసాపేట వెళ్లే రహదారిపూర్తిగా పాడైపోవడంతో అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ద్రుష్టిలో ఉంచుకొని ఆ రోడ్డుకి నిధులు మంజూరు చేస్తే..దానికి ఎవరో నిధులు మంజూరు చేశారని ప్రచారం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అభివ్రుద్ధి పనికి ఎవరు నిధులు మంజూరు చేశారో ప్రజలు కూడా తెలుసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్గబాబూరావుని డామినేట్ చేయాలని చూస్తున్న కొందరు అతని అనుచరులే ఈ విధమైన ప్రచారానికి తెరలేపి ప్రత్యేకంగా దినపత్రికల్లో వార్తలు రాయించారనే ప్రచారం జరుగుతోంది. ప్రజల్లో ఎమ్మెల్యేకి వస్తున్న విశేష ఆదరణ చూసి ఓర్వలేని ఒక వర్గం నాయకులే చేసిన పనిగానే నియోజవకర్గంలో తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సత్యవరం నుంచి మాసాపేట రోడ్డు విషయమై నేరుగా ఎమ్మెల్యే గొల్లబాబూరావు తానే ఫేస్ బుక్ , మీడియా వేదికగా వాస్తవాన్ని తెలియజేయడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.!