18సం. నిండితే ఓటు నమోదు చేసుకోవాలి..


Ens Balu
2
Hukumpeta
2020-11-28 19:24:15

విశాఖ ఏజెన్సీలో 18 సంవత్సరాలు నిండిన వారు తప్పకుండా ఓటు నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని   వెన్యూ డివిజనల్ అధికారిణి కె.లక్ష్మీ శివ జ్యోతి సూచించారు. శనివారం  హకుంపేట మండలం పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, ఓటర్ల నమోదు కార్యక్రమంపై వాలంటీర్లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. బూతు లెవెల్ అధికారులు అందుబాటులో వుండాలన్నారు. సచివాలయంలో ఎల్లప్పుడూ  సిబ్బంది కూడా అం దుబాటులో వుండి ఓటరు నమోదుపై ప్రజలకు వచ్చిన సందేహాలను నివ్రుత్ది చేయాలన్నారు. తదనంతరం ఆమె హుకుంపేట మండలం కొట్నాపల్లి గ్రామంలో గల సచివాలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రజలకు అందుతున్న సంక్షేమ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
సిఫార్సు