పందుల రబసపై పోలీసులకు ఫిర్యాదు..
Ens Balu
4
s.rayavaram
2020-11-29 09:22:24
ఎస్.రాయవరం ప్రజలను పందులు నానా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పందుల పెంపకం దారులను స్థానిక సచివాలయ సిబ్బంది హెచ్చరించా ఫలితం లేకుండా పోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రీ పగలు అనే తేడా లేకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెబుతున్నారు. విశేషమేమిటంటే ఈ పందుల ద్వారా పడుతున్న ఇబ్బందులను తట్టుకోలేక గ్రామస్తులు పోలీసు స్టేషన్ కి సైతం ఫిర్యాదు చేశారు. ఇపుడు స్పందనలో కూడా ఫిర్యాదు చేస్తున్నట్టు సమాచారహక్కు చట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు మీడియాకి వివరించారు. యస్.రాయవరం గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామ రైతులు వేసుకున్న పంట పొలాలను పందులు నాశనం చేస్తున్నాయన్నారు. గ్రామస్తులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న పందులను పెంచుతున్న పెంపకందారులను, అనేక సందర్భంలో గ్రామ పంచాయతీ అధికారులు హెచ్చరించినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికే పందులను గ్రామానికి చివరన పెంచుకోవాలని పెంపకం దారులకు చెప్పినట్టు రైతులు,గ్రామస్తులు చెప్పారు. పందుల కారణంగా గ్రామంలోని ప్రజలు అనారోగ్యం భారిన పడుతున్నారని, తరచూ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మెదడువాపు వ్యాధి, బోదకాలు వ్యాధి పందలు వలన వచ్చే అవకాశం వున్నందున పందులను ఊరవతలకి తరలించాలని పెంపకం దారులకు చెప్పామన్నారు. వినకపోతే, పెంపకం దారులపైనా పోలీసులకు ఫిర్యాదులు చేయడం తోపాటు జిల్లా కలెక్టర్ ద్రుష్టికి ఈ పందుల విషయాన్ని తీసుకెళతామని గ్రామస్తులు సైతం చెబుతున్నారు.