దుబ్బు నిలబెట్టి కడితే పంట పాడవదు..
Ens Balu
3
Kotavuratla
2020-11-30 17:37:28
తుపాను కారణంగా పాక్షికంగా పడిపోయిన వరి పొలం దుబ్బులను నిలబెట్టి కట్టు కోవడం ద్వారా పంట నాశనాన్ని నియంత్రించవ్చునని అనకాపల్లి ప్రాంతీయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. సోమవారం కోటవురట్ల మండలంలోని కోటవురట్ల, కైలాపట్నం. రాజుపేట గ్రామాల్లో పంటపొలాలను పరీశిలించారు. ఈ సందర్భంగా చీఫ్ సైంటిస్ట్ పి.సాంభశివరావు మాట్లాడుతూ, పడిపోయిన వరిదుబ్బులను నిలబెట్టుకోవడం ద్వారా పంట యదావిధిగా పండుతుందని, అయితే కిందరాలిన గింజ మొలకెత్తకుండా ఉండాలంటే 20కేజిల ఉప్పునీటిని ఎకరాపొలానికి పిచికారీ చేయడం వలన గింజ మొలకెత్తకుండా ఉండిపోతుందన్నారు. అదే సమయంలో పడిపోయిన గింజ భూమిలో కిలిసిపోతుందని వివరించారు. అదేవిధంగా రైతులకు ఉపయోగపడే కొన్ని సస్యరక్షణ చర్యలను కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో సైంటిస్టులు బి.భవానీ, కె.సైలజ, ఏఈఓ కె.సత్యన్నారాయణ, ఎంపీఈఓలు, విలేజి హార్టికల్చర్ సహాయకులు తదితరులు పాల్గొన్నారు.