కాలువ తవ్వి ఆ మట్టిని రోడ్డుమీదే వదిలేశారు..
Ens Balu
3
s.rayavaram
2020-12-06 09:51:51
అధికారులు చేసే ఒక్కోపని ప్రజలకు వాహనదారులకు తీవ్రమైన పరీక్షలు పెడుతోంది. ఏదో మొక్కుబడిగా చేసిన పనికి ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎస్.రాయవరం నుంచి సర్వసిద్ది పోవు తారురోడ్డు ను అనుకొని ఉన్న సర్వసిద్ది పంటకాలువ పూడికలను ఇటీవలే తొలగించారు. అలా తీయగా వచ్చిన మట్టిని తారురోడ్డు పై వేసి చేతులు దులుపుకున్నారు. దీంతో ఆ మట్టికాస్త రోడ్డుకి ఇరువైపులా దిబ్బలుగా మారిపోయింది. వర్షం వచ్చిన ప్రతీసారి రోడ్డు మొత్తం బురదమయంగా మారిపోతుంది. ఈ విషయమై అధికారులకు గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామానికి చెందిన సమాచార హక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు వాపోతున్నారు. కాలువు పూడికలు తీసి వదిలేశారని, అదే మట్టి మళ్లీ కాలువల్లోకి జారడంతో పాటు ఇటు రోడ్డుపై ప్రయాణాలు చేసేవారికి కూడా ఇబ్బందిగా మారుతోందన్నారు. ఇప్పటికైనా అధికారులు వాహన చోదకుల కష్టాలను ద్రుష్టిలో ఉంచుకొని రోడ్డుపై వేసిన మట్టిని తొలగించాలని రాజు అధికారులను కోరుతున్నారు.