"ఇల్లు-ఇల్లాలు "చిత్రానికి 48 వసంతాలు
Naveen Prasad
2
2020-12-07 14:06:25
సూపర్ స్టార్ "కృష్ణ" , కళాభినేత్రి వాణిశ్రీ అద్భుతంగా నటించిన చిత్రం "ఇల్లు-ఇల్లాలు".
సుబ్బిరెడ్డి సమర్పించిన ఈ చిత్రాన్ని నందిత ఫిల్మ్స్ వారు నిర్మించారు.
స్క్రీన్‌ప్లే , దర్శకత్వం పిచంద్రశేఖర్రెడ్డి వహించారు . N.సుబ్బారాయుడు , G.A. రామసుబ్బయ్య నిర్మాతలుగా వ్యవహరించారు .
ఇంటి యొక్క విలువను ,
ఇల్లాలు యొక్క ప్రాధాన్యతను ఈ చిత్రంలో ఎంతో చక్కగా చూపించారు దర్శకుడు చంద్రశేఖర్ రెడ్డి .
సంగీత పరంగా ఎంతో ఘన విజయం సాధించింది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కనకవర్షం కురిపించింది. మాస్ హీరోగా ప్రసిద్ధిగాంచిన సూపర్ స్టార్ "కృష్ణ " ఈ చిత్రంలో ఎంతో క్లాస్ గా నటించడం విశేషం. ఈ చిత్రానికి మృదుమధురమైన సంగీతం కె.వి.మహదేవన్ అందించారు . ఈ చిత్రం విడుదల తేదీ 07-12-1972.
నేటితో నలభై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం యూనిట్ కు ENS సినిమా అభినందనలు తెలియ చేస్తుంది .