విశాఖజిల్లా ఎస్.రాయవరం మండలంలో మరుగుదొడ్లలో జరిగిన అవినీతిపై ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. మండలంలో 28 గ్రామ పంచాయతీలకు మంజూరు అయిన 6539 వ్యక్తిగత మరుగుదొడ్ల పధకం కు మంజూరైన రూ 9.22 కోట్లు రూపాయలు ప్రోత్సాహకం చెల్లింపుల్లోను, నిర్మాణాల్లోను జరిగిన భారీ అవకతవకలపై సమాచార హక్కు కార్యకర్త సోమిరెడ్డి రాజు రాష్ట్ర జస్టిస్ లోకాయుక్త కు చేసిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రూరల్ వాటర్ సప్లై యస్.ఇ, వి. రవికుమార్ వారం రోజుల క్రితం పేటసూదిపురం గ్రామం లో విచారణ చేపట్టారు. ఇందులో ఎంతమంది లబ్దిదారులున్నారు, ఏ స్థాయిలో అవినీతి జరిగింది, ఎంతమందికి ప్రోత్సాహకాలు అందాయి తదితర అంశాలను స్వయంగా లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ విచారణ కార్యక్రమంలో ఎ.ఇ యస్.కె.సాహెబ్, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఎం.ఆర్.సీ లు, తమ సిబ్బందితో స్వయంగా పరిశీలించి లబ్దిదారులను విచారిస్తున్నారు. ఈ రెండు రోజులలో వమ్మవరం, పెనుగొల్లు, గెడ్డపాలెం, పి.దర్మ వరం గ్రామాల్లో విచారణ చేశామని తెలిపారు.