అక్కడ ఏవైనా సగం సగం పనులే..
Ens Balu
2
s.rayavaram
2020-12-12 22:10:05
ప్రభుత్వం గ్రామసచివాలయాల ద్వారానే అన్ని సేవలూ ప్రజలకు చేరాలని ప్రభుత్వం నెత్తీ నోరూ కొట్టుకుంటే..దానికి భిన్నంగా ఎస్.రాయవరం సచివాలయ అధికారులు వ్యవహరింస్తున్నారు. కాలువ కోసం తవ్విన మట్టిని వదిలేయకుండా తొలగించాలని అర్జీచేస్తే సగం సగం తవ్వేసి వదిలిపెట్టేశారు. మండల కేంద్రం ఎస్.రాయవరం నుంచి సర్వసిద్ది గ్రామం వెళ్లే తారురోడ్డును అనుకొని ఉన్న సర్వసిద్ది పంటకాలువ పూడిక తీయగా వచ్చిన మట్టిని గ్రామ పంచాయతీ సిబ్బంది తారురోడ్డుపై వేసి వదిలేశారు. దీంతో ఈవిషయమై మండలానికి చెందిన సమాచారహక్కుచట్టం కార్యకర్త విషయాన్ని పంచాయతీ సిబ్బందికి ద్రుష్టికి తీసుకెళ్లడంతో అక్కడ పోసిన మట్టిని పూర్తిగా తొలగించకుండా సగం సగం తీసి వదిలేశారు. దీంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది. పంచాయతీ సిబ్బంది ఏంచేసినా ఇలా సగం సగం పనులే చేస్తూ ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని సోమిరెడ్డిరాజు మీడియాకి వివరించారు. సగం సగం తీసిన మట్టి కూడా రోడ్డుపైకి రావడంతో చినుకులు పడిన సమయంలో బురదమయంగా మారుతోంది. మళ్లీ ఈవిషయాన్ని గ్రామసభ ద్రుష్టికి కూడా తీసుకెళ్లినట్టు రాజు చెప్పారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని కాలువ దగ్గర మట్టిని పూర్తిస్థాయిలో తొలగించాలని రాజు పంచాయతీ అధికారులను కోరుతున్నారు. ప్రభుత్వం అన్నిశాఖలకు సిబ్బందిని నియమించినా ఎస్.రాయవరంలో మాత్రం సచివాలయ సేవలు ప్రజలు పూర్తిస్థాయిలో అందడటం లేదని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువమట్టిని తొలగించకపోతే ఈసారి ఆ ఫిర్యాదును జిల్లా కలెక్టర్ కి అందజేస్తానని రాజు చెప్పారు. పూర్తిస్థాయిలో మట్టిని పూర్తిగా తొలగించాలని, అంతే తప్ప తూతూ మంత్రంగా పనులు చేయవద్దని మరొకసారి పంచాయతీ అధికారులను రాజు కోరారు.