"విక్టరీ వెంకటేష్ " పుట్టినరోజు నేడు
Naveen Prasad
3
2020-12-13 02:41:15
దగ్గుబాటి రామానాయుడు, శ్రీమతి రాజేశ్వరి దంపతులకు రెండో సంతానంగా దగ్గుబాటి వెంకటేష్ తే 13-12-1960 దీ నాడు కారంచేడు లో జన్మించారు.
విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తండ్రి రామానాయుడు తో, అన్న సురేష్ బాబుతో సినిమాలలో నటించే అభిరుచి ఉన్నట్టు తన మనసులో మాట తెలియజేశారు వెంకటేష్ .
ఆమోద ముద్రవేసి అంగీకారం వెంటనే తెలియజేశారు వీరిద్దరు.
వీరి సొంత బేనర్ అయినటువంటి సురేష్ మూవీస్ బ్యానర్పై" కలియుగ పాండవులు " చిత్రాన్ని నిర్మించారు . ఈ చిత్రానికి తండ్రి రామానాయుడు నిర్మాతగా వ్యవహరించారు.
వెంకటేష్ హీరోగా నటించిన మొదటి చిత్రమే విజయవంతం కావటం విశేషం.
" బొబ్బిలిరాజా " "ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" " సూర్యవంశం" "ప్రేమించుకుందాం రా" "కలిసుందాం రా !" " రాజా" "జయం మనదేరా " "లక్ష్మి" "సంక్రాంతి " "సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు" " F2 "వంటి చిత్రాలెన్నో విజయం సాధించాయి. ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి కుటుంబ కధా చిత్రాల కధానాయకుడిగా తెలుగు ప్రేక్షకులతో అభినందించ బడుతున్న హీరో వెంకటేష్.
పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి "విక్టరీ"ని ఇంటి పేరుగా చేసుకున్న "విక్టరీ వెంకటేష్" పుట్టినరోజు నేడు. అంతేకాకుండా పెళ్లి రోజు కూడా ఈ రోజే కావడం గమనించ దగ్గ విషయం . ఇటువంటి పుట్టినరోజులు, పెళ్లిరోజులు విక్టరీ వెంకటేష్ గారు ఎన్నో ...ఎన్నెన్నో... ఆనందకరంగా,జరుపుకోవాలని
ENS సినిమా పేజీ టీమ్ కోరుకుంటుంది .