ఈ-సేవలపై తక్షణమే స్పందించాలి..
Ens Balu
4
Pusapatirega
2020-12-19 21:56:33
సచివాలయాల సిబ్బంది ఈ-సేవలపై దృష్టిపెట్టి తక్షణమే పరిష్కారం అయ్యేలా చూడాలని సంయుక్త కలెక్టర్ (ఆసరా) జె.వెంకటరావు ఆదేశించారు. శనివారం పూసపాటిరేగ మండలం కొప్పెర్ల, విజయనగరం మండలం నారాయణపురం గ్రామ సచివాలయాన్ని, బాబామెట్ట చిక్కాలవీధిలో ఉన్న వార్డు సచివాలయాన్ని తనిఖీ చేసారు. రికార్డులన్నింటిని పరిశీలించి పెండింగు వున్నఈ-సేవలపై ఆరా తీసారు. ప్రభుత్వ పధకాలకు లబ్దిదారుల ఎంపికలో సచివాలయ సిబ్బంది కీలకపాత్ర వహించాలన్నారు. ప్రభుత్వ పధాల వివరాలను ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. ప్రతీ ఒక్కరు సచివాలయానికి దగ్గరలోనే నివాసం వుంటూ 24 గంటలు ప్రజలకు అందుబాటులో వుండాలన్నారు. సచివాలయ పరిసరాలను పరిశుభ్రగా వుంచుకోవాలని, ఆవరణలో ఖాళీ స్థలంలో మొక్కులు నాటాలని తెలిపారు. కోవిడ్ 2వ దశ విస్తరించకుండా వుండేలా ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. మాస్కు తప్పనిసరిగా వాడడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం తదితర అంశాలపై అవగాహన కలిగించాలన్నారు.