వైఎస్ జగనన్న తోడుకి సహకరించండి..
Ens Balu
3
Kurupam
2020-12-19 22:00:48
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న తోడు పథకం అమలు కు బ్యాంకులు ముందుకు రావాలని ఐ.టి.డి.ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. శనివారం తన పర్యటనలో భాగంగా జీయ్యమ్మవలస ఆంధ్రా బ్యాంక్, గ్రామీణ విశాఖ బ్యాంక్ , కురుపాం లో గ్రామీణ విశాఖ బ్యాంక్ లను సందర్శించారు. ఈ సంద్భంగా ప్రాజెక్ట్ అధికారి జగన్ తోడు ఋణాల మంజూరుకు సంబంధిత వివరాల పై ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ పార్వతీపురం ఐ.టి.డి.ఎ పరిధిలో గల 8 సబ్ ప్లాన్ మండలాల్లోని 4 వేల మంది లబ్ధిదారులకు ఎంపిక చేసి ఋణాలు మంజూరు చేయాలన్నారు, ఆర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి బ్యాంక్ ఋణాలు త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. మంజూరులో ఆలసత్వం వద్దని సూచించారు. ఈ పర్యటనలో ఎ.పి.డి, ఎ.పి. ఓ, ఎం.పి.డి.ఓ, రెవెన్యూ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.