ఆ ఆదాయం ప్రభుత్వానికి కట్టాల్సిందే..


Ens Balu
1
s.rayavaram
2020-12-20 15:59:25

విశాఖ జిల్లా, మండల కంద్రమైన ఎస్.రాయవరం గ్రామ పరిధిలోని అనంతసాగరం చెరువుపై వచ్చే ఆదాయం మొత్తం ప్రభుత్వానికి వివిధ శాఖలకు చెల్లించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై ఉత్తర్వులు కూడా జారీచేసింది. అనంతసాగరం చెరుులో సర్ప్లస్ వియర్ ను తమ స్వార్థం కోసం ధ్వంశం చేసారని, నిబంధనలకు విరుద్ధంగా రెవిన్యూ అధికారులు చెరువు గర్భంను పట్టాలు ఇచ్చారని, చెరువులో చేపల పెంపకానికి ఇస్తూ ఆ సొమ్మును గ్రామపంచాయతీకి గాని, నీటిసంఘంకు గాని చెల్లించకుండా స్వాహా చేస్తున్నట్లు సమాచార హక్కు చట్ట కార్యకర్త సోమిరెడ్డి రాజు రాష్ట్ర జస్టిస్ లోకాయుక్త కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా అధికారులు ఈ చెరువుపై  విచారణ చేశారు. దీంతో వాస్తవాలు వెలుగుచూశాయి. అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన  నివేదిక, ఆపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు.. అధికారులు ఇచ్చిన తీర్మానం ప్రకారం అనంతసాగరం  చెరువును గ్రామ పంచాయతీకి గుత్త హక్కులు ఇస్తూ, చేపల పెంపకంకు మత్యశాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాట ద్వారా కేటాయించాలి. అలా కేటాయింపు ద్వారా  వచ్చిన ఆదాయంలో 30 శాతం గ్రామసచివాలయానికి, 50 శాతం నీటిసంఘానికి, 20 శాతం మత్యశాఖకు చెందుతాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటి ఆ చెరువుపై వచ్చిన ఆదాయాన్ని ఎవరికి నచ్చినట్టు వాళ్లు తమ సొంతానికి వాడుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ద్వారా చెరువుపై వచ్చిన ఆదాయం నిర్ధేశించిన ప్రభుత్వశాలకు అందించాలి. అలా అందించకుండా స్వార్ధానికి వినియోగిస్తే సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు. ప్రభుత్వం అనంతసారం చెరువుపై ఈ విధమైన ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా గుత్తదారులు, మధ్యవర్తులు ఆదాయాన్ని దోచేయకుండా సమాచారహక్కుచట్టం కార్యకర్త రాజు లోకాయుక్తాకి ఫిర్యాదు చేయడం ద్వారా నియంత్రించగలిగారు. ప్రభుత్వ ఉత్తర్వులతో ఇప్పటి వరకూ అప్పనంగా చెరువువై ఆదాయాన్ని తమ సొంత అవసరాలు వినియోగించుకున్న వారి గొంతులో పచ్చి వెలక్కాయ్ పడినట్టు అయ్యింది..