ఆ మేన్ హోల్ కనిపించలేదా సారూ..
Ens Balu
3
s.rayavaram
2020-12-20 16:07:25
అక్కడ ఎలాంటి పైకప్పులేని మేన్ హోల్స్ పాదచారులను, వాహనచోదకులను భయపెడుతున్నాయి...సచివాలయ సిబ్బందికి ఈ విషయం తెలిసినా తమకేంటిలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎంతో మంది ఈ మ్యాన్ హోల్స్ భారిన పడి గాయాల పాలవుతున్నారు. విశాఖ జిల్లా, ఎస్.రాయవరం మండలకేంద్రంలోని బజారు సెంటర్ మెయిన్ రోడ్డు నుంచి వెంకన్నపేట గౌరీపరమేశ్వర దేవాలయంకు పోవు రోడ్డులో గురజాడ కాంప్లెక్స్, ఆంజనేయస్వామి గుడికి మధ్య ఉన్న డ్రైనేజీ పై ఉన్న రెండు మ్యాన్ హోల్స్ పై ఏర్పాటు చేసిన ఇనుప కవర్లు పాడైపోయాయి. ఒకటి తుప్పపట్టి పోయింది. మరొకటి పూర్తిగా లేకుండా పోయింది. దీనితో ఈ ప్రాంతానికి వచ్చినవారు ఒక్కోసారి మ్యాన్ హోల్స్ వద్ద గాయాల పాలవుతున్నారు. చాలా మందికి ఈ పాడైన మేన్ హోల్స్ వలన గాయాలయ్యాయని మండలానికి చెందిన సమాచార హక్కుచట్టం కార్యకర్త సోమిరెడ్డి రాజు చెబుతున్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, మండల కేంద్రానికి మెయిన్ సెంటర్ లో ఈ ప్రాంతంలో మేన్ హోల్స్ పాడైపోతే వాటిని బాగుచేయించాల్సిన సచివాలయ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం పద్దతిగా లేదన్నారు. ముఖ్యంగా తుప్పుపట్టిన మేన్ హోల్ రేకుల కారణంగా ఎంతో మంది రైతులు, మార్కెట్ కి వచ్చేవారు గాయాల పాలవుతున్నారని అన్నారు. అదే విధంగా ప్రాధమిక పాఠశాల-5 ఎదురుగా ఉన్న రోడ్డును ఆనుకొని ఉన్న డ్రైనేజికి ఉన్న ఇటువంటి సమస్యే ఉందని రాజు చెబుతున్నారు. దీనిపై కూడా పిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని వాపోయారు. ఇప్పటికైనా సంబంధిత సచివాలయ స్పందించి మేన్ హోల్స్ ను సరిచేసి ప్రజలు గాయాల పాలు కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు.