సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు..
Ens Balu
3
ఉప్పలగుప్తం
2020-12-20 18:30:11
రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలు శుభిక్షంగా ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం మంత్రి ఉప్పలగుప్తం మండలం ఎన్. కొత్తపల్లి లో వేంచేసి యున్న శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలోనూ అందించని సంక్షేమ పథకాలు సీఎం వైఎస్ జగన్ మాత్రమే అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని,రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతోను,సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కరోనా రెండో దశ కేసులు పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా మహ్మమ్మారి కూడా పూర్తిగా అంతం చేయాలని స్వామిని కోరుకున్నట్టు మంత్రి చెప్పారు.