పాఠశాల భవనాలు సత్వరం పూర్తిచేయాలి..
Ens Balu
3
Makkuva
2020-12-21 22:24:11
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పార్వతీపురం ఐటిడిఏ పీఓ కూర్మనాధ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మక్కువ మండలం అనసభద్ర లో 12 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణ పనులను ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ పరిశీలించారు. నిర్మాణ పనులకు సంబంధించి ముందుగా సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల నుండి ఆరా తీశారు, అనంతరం ప్రాజెక్ట్ అధికారి మాట్లాడుతూ రానున్న జనవరి2021 నాటికి బేస్మెంట్ లెవెల్ కి పనులు పూర్తి కావాలని, అలాగే భవన నిర్మాణం త్వరిత గతిన పూర్తి చేయ డానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. అలాగే పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు.
ఈ పర్యటనలో. ట్రైబల్ వెల్ఫేర్ ఇఇ శాంతిస్వరరావు, నాయుడు, ఎ.ఇ ఆర్.నరసింహమూర్తి, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.