పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేయాలి..


Ens Balu
3
Kurnool
2020-12-21 22:50:02

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 25వ తేదీన చేపట్టిన "ఇంటి పట్టాల పంపిణీ" కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం  కర్నూలు నగర పాలక పరిధిలోని ప్రజలకు కర్నూలు మండల పరిధిలోని రుద్రవరం గ్రామ శివారులో ఇస్తున్న 21,488 మందికి ఇంటి స్థలాల కోసం ఇస్తున్న పట్టాల లేఅవుట్ ను పరిశీలించారు. ముఖ్యంగా సర్వేయర్లు  త్వరత్వరగా గతంలో బ్లాక్ల వారిగా విభజించిన లేఅవుట్ స్థలాలకు సరిహద్దు గీతలకు సున్నం వేయించి, సరిహద్దు రాళ్ళు పాతించాలి అలాగే వాటికి పెయింటింగ్ వేయించాలని సూచించారు. అలాగే రేపటి నుంచి విధులకు వచ్చే వార్డు ప్లానింగ్ కార్యదర్శుల సేవలు కూడా వినియోగించుకోవాలని ఎంఈ రమణమూర్తి గారికి తెలిపారు. నిర్ధేశించిన కొలతల వారీగా వారి చేత పాతిన సరిహద్దు రాళ్లపై సర్వే నంబరింగ్ ను మార్కింగ్ వేయించాలన్నారు. అనంతరం స్థలాల చదును ప్రక్రియను  వేగవంతంగా పూర్తి చేయించాలని చెప్పారు
సిఫార్సు