బయటకి వెళితే మూమెంట్ రిజిస్టర్ తప్పనిసరి..


Ens Balu
2
Narpala
2020-12-22 16:01:30

సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తే మూమెంట్ రిజిస్టర్లో తప్పకుండా తమ పేర్లను నమోదు చేయాలని, మూమెంట్ రిజిస్టర్లో పేర్లు నమోదు చేయకపోతే అలాంటివారిపై తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు హెచ్చరించారు. మంగళవారం నార్పల మండలంలోని నాయనపల్లి గ్రామ సచివాలయంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయంలో రిజిస్టర్ లను తప్పనిసరిగా నిర్వహించాలని, ఉద్యోగుల వివరాలను తూచా తప్పకుండా ఖచ్చితంగా నమోదు చేయాలన్నారు. సచివాలయ ఉద్యోగులు తమ విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించాలన్నారు. సచివాలయంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను, పోస్టర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు.  ఈ సందర్భంగా మూమెంట్ రిజిస్టర్లో పేర్లు నమోదు చేయకుండా బయటికి వెళ్ళిన సచివాలయ ఉద్యోగులకు మెమో జారీ చేయాలని పంచాయతీ సెక్రటరీని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మరోసారి ఉద్యోగులు పేరు నమోదు చేయకుండా ఎవరు బయటికి వెళ్లకుండా చూడాలని, ఎవరైనా పేరు నమోదు చేయకుండా బయటకు వెళితే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సచివాలయంలో రిజిస్టర్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ సుబ్బరాయుడు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.