టిడ్కో ఇళ్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి..
Ens Balu
3
Rudravaram
2020-12-22 18:46:01
కర్నూలు నగర పాలక పరిధిలోని "అందరికీ ఇళ్ల పథకం" కింద ఈ నెల 25న అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిషనర్ డికెబాలజీ అన్నారు. మంగళవారం కర్నూలు మండలం రుద్రవరం గ్రామ శివారులో ఇప్పటికే గుర్తించిన లేఅవుట్ స్థలాలను ఆయన అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, టిడ్కో ఎస్ఈ రాజశేఖర్, ఆ సంస్ధ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర టౌన్ షిప్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కొర్పొరేషన్(ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ప్రభుత్వం సేల్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వనుందన్నారు. లబ్ధిదారులకు మంజూరుకు చేయడానికి నగర పాలక పరిధిలోని మూడు నియోజకవర్గాల వారీగా ఉన్న అర్హులైన లబ్ధిదారులకు చేసే రిజిస్ట్రేషన్ ప్రక్రియ విధానం, యూనిట్ల మంజూరుకు తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు గృహ సముదాయాల వద్ద పండగ వాతావరణంలో జరిగే ఇళ్ల మంజూరు కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ బాలాజీ ఆదేశించారు. మూడు కేటగిరీల వారీగా లబ్ధిదారులకు జి+3 నమూనాలో నిర్మించిన ఈ గృహాల్లో ఇప్పటికే మునిసిపల్ కార్మికులు శుభ్రత చర్యలు చేపడుతున్నారు. టిడ్కో డిఈ రవిగుప్త, సోషల్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ పెంచలయ్య, ఎం.ఐ.ఎస్ స్పెషలిస్ట్ మధు, శివశంకర్, ఎస్.పి.సి.ఎల్...ఏజీఎం రవిచంద్ర తదితరులు ఉన్నారు.