గిరిజనుల సేవలో ఆ ఉత్తమ ఐఏఎస్ అధికారి..


Ens Balu
5
Paderu
2020-12-22 19:32:06

ఆ పీఓ బాబు వలనే ఈరోజు కాస్త మంచినీరు తాగుతున్నాం..ఆ పీఓ బాబు వలనే మా పిల్లలకు చదువుకోవడానికి బడి వస్తుంది...ఆయన వలనే మా గిరిజన గూడేలా దీర్ఘకాలిక సమస్యలు తీరుతున్నాయి.. రోడ్లు, వైద్యం, ఆరోగ్యం అన్నీ ఆ పీఓబాబు వలనే ఆ బాబు మా ఊరు వస్తే ఏదోఒకటి మంజూరు చేస్తారు..ఈ మాటలన్నీ అంటున్నది ఎవరికోసమో కాదు పాడేరు ఐటిడిఏ పీఓ డా.వెంకటేశ్వర్ సలిజామల కోసమే.. అవునండీ మీరు చదువుతున్నది నిజమే. గిరిజనుల సమస్యలు ఒక్కొక్కటిగా తీరుతుండటంతో ఇక్కడి పీఓని గిరిజనులంతా దేవుడిలా కొలుస్తున్నారు. ఆయన తమ గిరిజన తండాలకు వస్తే దండలు వేసి హారతులు పడుతున్నారు.. ఇవన్నీ మంగళవారం పాడేరు మండలంలోని డొంకిన వలస గిరిజన తండాలో మీడియాకి ఎదురైన మంచి అనుభవాలు.. అవన్నీ ఈ వార్త రూపంలో మీకోసం..!  ఆంధ్రప్రదేశ్ లోని విశాఖజిల్లా, పాడేరు ఐటిడిఏ అంటే ఒక మంచి పేరు..ఇక్కడ పనిచేసే అధికారులకు మరింత పేరు హోదా..కాని ఇక్కడ పనిచేసిన అతి కొద్ది మంది ఐఏఎస్ అధికారులు మాత్రమే గిరిజనుల మనసుల్లో నిలిపోతారు..అలాంటి అధికారుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్న ప్రాజెక్టు అధికారి మాత్రం డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల అని చెప్పక తప్పదు... మీరు ఈ వార్తలో విషయాలు తెలుసుకుంటున్నది  నిజమే. గిరిజనుల అభివ్రుద్ధే ద్యేయంగా పనిచేయడంలో ఈయనకు ఈయనే సరిసాటి. ప్రభుత్వ ఆదేశాల మేరకు గిరిజనులకు ఐటిడిఏ ద్వారా ఎంత వరకూ అభివ్రుద్ధికి అవకాశం వుందో అంతా చేయడంలో ఈయన వ్యవహారిక విధానమే చాలా స్పష్టంగా వుంటుంది. దీనితో విశాఖ ఏజెన్సీలోని 11 మండలాల్లోని గిరిజనుల మనసుల్లో నిలిచిపోయారు ఈ ఐఏఎస్ అధికారి. ఏ గ్రామానికి వెళ్లినా నిండైన ప్రేమ, అభిమానంతో గిరిజనులకు ఈ అధికారికి స్వాగతం పలుకుతారు. నేరుగా గిరిజనులతో మాట్లాడి వారి కష్టాలను తీర్చడంలో చాలా వేగంగా పనిచేసేయడంతో గిరిజనులకు ఈ ప్రాజెక్టు అధికారిని దేవుడిలా కొలుస్తున్నారు. అదే సమయంలో గిరిజను విషయంలోనూ,విధి నిర్వహణ లో అలసత్వం వహించి అధికారుల విషయంలోనూ అదే స్థాయిలో చర్యలు తీసుకోవడంలోనూ ఈ ఐఏఎస్ అధికారి చాలా ఘాటుగా వ్యవహరించడం కూడా చర్చనీయాంశం అవుతుంది. గిరిజనుల అభివ్రుద్ధి కోసమే ఏర్పడిన ఐటిడిఏలో వారికోసం పనిచేయకపోతే ప్రాజెక్టు అధికారి అనే మాటకు అర్ధంలేదు...ఈ ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ...జీతాలు తీసుకుంటూ అలసత్వం వహిస్తే అంతకంటే దారుణం మరొకటి ఉండదు అంటూ తడుముకోకుండా చెబుతారాయన. తానుు పనిచేస్తున్నట్టుగానే...మిగిలిన అధికారులను, సిబ్బందిని కూడా పనిచేయించేలా చేయడంలోనూ ఈయన తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. దీనితో ఈ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు..మంత్రులు, ఎంపీలు గిరిజనుల కోసం ఏ పనిచేసినా ఈ ప్రాజెక్టు అధికారితో కలిసే పనిచేయడం, సహాయం తీసుకోవడం కూడా శుభపరిణామంగా చెబుతున్నారు. చాలా సంవత్సరాల తరువాత అంటే గతంలో ఐటిడిఏలో పనిచేసిన పీఓలు వినయ్ చంద్, డికెబాలజీ లాంటి ఉన్నత స్వభావం కలిగిన అధికారులను చూసిన ఆయన వారి స్పూర్తితో మరింతగా గిరిజనులకు సేవలందిస్తున్నారు. ఐఏఎస్ లు అంతా ఈ విధమైన సేవలు చేయగలిగితే రాష్ట్రాభివ్రుద్ధి దేశంలో ఆంధ్రప్రదేశ్ ని ఒకటవ స్థానంలో నిలబెడుతుంది అని విశ్లేషకులు భావించేలా ఈయన సేలు గిరిజనుల విషయంలో ఉంటున్నాయంటే ఇంకో మాట చెప్పే పనికూడా లేదని సమాధానం వస్తుంది...ఏదైనా ఒక ఉన్నతాధికారి పనిచేసిన తీరే ఆయన అంటే గౌరవాన్ని ఏర్పడేలా చేస్తుందనడానికి పీఓ డా.వెంకటేశ్వర్ సలిజామల ఒక నిలువెత్తు నిదర్శనంలా నిలుస్తున్నారు..!
సిఫార్సు