సచివాలయాన్ని శుభ్రంగా ఉంచాలి..


Ens Balu
4
సింగనమల
2020-12-22 19:51:14

గ్రామ, వార్డు సచివాలయాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలని, సచివాలయంలో ప్రతి ప్రభుత్వ పథకాల పోస్టర్లను, లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం సింగనమల గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయం చుట్టుపక్కల పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు. సచివాలయంకు వచ్చే సర్వీసులకు పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలన్నారు. సచివాలయం కు సంబంధించి ప్రహరిగోడ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు పంపించాలన్నారు. సచివాలయం పనితీరుపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సింగనమల తహశీల్దార్ విశ్వనాథ్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.