భూ సర్వే ద్వారా శాస్వత భూహక్కు..
Ens Balu
1
Pithapuram
2020-12-22 20:18:57
వైయస్ఆర్-జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పధకంతో భూమి యజమానులకు సమగ్ర రీ సర్వే ద్వారా శాశ్వత భూ హక్క కల్పించడమే కాకుండా దానిని సంరక్షేంచే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని జిల్లా ఇన్ చార్జి మంత్రి మరియు రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మంగళవారం పిఠాపురం మండలం నవఖండ్రవాడ గ్రామంలో బాదం వారి సత్రానికి సంబంధించిన భూమి సర్వే నెంబరు 46లో సరిహద్దు రాయిని నాటి సమగ్ర రీ సర్వే ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో మంత్రి మాట్లాడుతూ ఆనాడు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా వచ్చిన వినతుల్లో 60 శాతం పైగా భూ వివాదాల పైనే రావడంతో ఆనాడే ముఖ్యమంత్రి సమగ్ర రీసర్వేకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ సమగ్ర రీ సర్వేను సర్వే ఆఫ్ ఇండియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో
ఎంతో పటిష్టంగా నిర్వహిస్తోందని మంత్రి చెబుతూ భూ యజమానులు రైతులు సర్వే బృందాలకు పూర్తి సహకారం అందించాలని మంత్రి సూచించారు. ఈ సమగ్ర రీ సర్వే మరియు 25వ తేదీన జరిగే భూ పట్టాల పంపిణీ కార్యక్రమం రెండూ కూడా చారిత్రాత్మక ఖట్టాలని మంత్రి అభివర్ణిస్తూ ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి వెయ్యి కోట్ల రూపాయలతో ఈ సమగ్ర రీసర్వే కార్యక్రామాన్ని చేపట్టారని మంత్రి తెలిపారు . ఈ రీ సర్వేలో పొరపాట్లకు తావేలేదని, శాటిలైట్ ద్వారా వచ్చిన మేప్ ల ప్రకారం సర్వే బృందాలు హద్దు లు వేయడం జరుగుతుందని మంత్రి తెలియజేశారు. తండ్రి ఆశయాన్ని నిలబెట్టాలనే ఉద్దేశ్యంతో 3648 కి.మీ. పాదయాత్ర చేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి సమర్ధవంతమైన , పారదర్శకమైన పాలనను ప్రజలకు అందిస్తున్నారని మంత్రి తెలియజేశారు. ఒక్కరూపాయి అవినీతికి కూడా తావులేకుండా నాలుగు లక్షల ఉద్యోగాలను ప్రభుత్వం ఇచ్చిందని, మంత్రులకు పూర్తి శ్వేఛ్ఛనిచ్చి సమర్ధవంతమైన పాలనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ముఖ్యమంత్రి కల్పించారని మంత్రి తెలియజేశారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలలో నూతన పోకడలను తీసుకురావడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలను వరదలై పారిస్తున్నారని మంత్రి తెలియజేశారు.
కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతా విశ్వనాధ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదలకు 30 లక్షలు నివాసయోగ్యమైన ఇళ్ళ పట్టాలు ఇవ్వడం దేశ చరిత్రలోనే మొదటి అపురూపమైన ఘట్టమని అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల పట్టాలైతే ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 3 లక్షల 80 వేల పట్టాలు ఇవ్వడం సామాన్యమైన విషయం కాదని , ఈ విషయంలో కష్టించి పని చేసిన రెవెన్యూ అధికారులకు ఎంపి అభినందించారు.
జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ భూ యజమానులకు రీ సర్వే ద్వారా హక్కు కల్పించడం ఒక ఎత్తైతే, దానిని సంరక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవడం రైతులకు సంతోషదాయకమైన విషయమన్నారు. రాబోయే రోజుల్లో సచివాలయాల వద్దనే రిజిస్ట్రేషన్లు జరిపి, రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రభుత్వం సరళతరం చేయనున్నదని కలక్టర్ తెలియజేశారు. వాలంటీర్ల వ్యవస్ధ ద్వారా సంక్షేమ కార్యక్రమాలను అర్హుల మందుకు తీసుకువెళ్ళడం ద్వారా లబ్దిదారులు కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమను ప్రభుత్వం తొలగించిందని కలక్టర్ తెలియజేశారు.
పిఠాపురం శాసన సభ్యులు పెండెం దొరబాబు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాలను నిరుపేదలకు నిరంతరం అమలు చేశారని అన్నారు. ముఖ్యమంత్రి రైతులకు, భూ యజమానులకు విస్తృత ప్రయోజనం చేకూరే విధంగా సమగ్ర రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, గ్రామాల్లో రైతులు, భూ యజమానులు సర్వే బృందాలకు సహకరించాలని సూచించారు. గ్రామాలలో రోడ్ల పైనే ఇళ్ళ నిర్మాణం చేపడుతున్నారని, దీని వలన రోడ్ల పై ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందని, దీని పై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్ కు , జాయింట్ కలక్టర్ కు శాసన సభ్యులు విజ్ఞప్తి చేశారు.
జిల్లా జాయింట్ కలక్టర్ జి.లక్ష్మి శ మాట్లాడుతూ సమగ్ర రీసర్వే అనంతరం ప్రతి భూ యజమానికి శాశ్వత హక్కు పత్రాన్ని ప్రభుత్వం ఇస్తుందని , దళారీ వ్యవస్ధను నిర్మూలించి, అవినీతిని రూపమాపడానికి ప్రభుత్వం ఈ సమగ్ర రీసర్వేను చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ రీ సర్వేలో భూ యజమానులు, రైతులు వారి సరిహద్దులను సర్వే బృందాలకు చూపిస్తే సరిపోతుందని జేసి అన్నారు. సర్వే లో వచ్చిన భూ వివాదాలను మొబైల్ కోర్టు ద్వారా పరిష్కరించడం జరుగుతుందని, ఇందు కోసం ప్రతి మండలంలోను మోబైల్ కోర్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందని జాయింట్ కలక్టర్ తెలియజేసారు.
సమావేశానికి అధ్యక్షత వహించిన కాకినాడ ఆర్.డి.ఓ. చిన్ని కృష్ణ మాట్లాడుతూ జిల్లాలో మొదటిగా సమగ్ర రీసర్వే చేపట్టిన నవఖండ్రవాడ గ్రామంలో 306 ఎకరాల ఒక సెంటు విస్తీర్ణం ఉందని, మొత్తం సర్వే నెంబర్లు 103 కాగా, రైతులు 244 మంది ఉన్నారని తెలియజేశారు. ముందుగా ఇన్ చార్జి మంత్రి సమగ్ర రీసర్వేలో వినియోగించే సాప్రదాయ రీసర్వే పరికరాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి ఎవిఆర్ఎస్ఎస్వి గొపాలకృష్ణ, ఫారెస్ట్ సెటిల్ మెంట్ ఆఫీసర్ శ్రీరామచంద్రమూర్తి, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.