ఇన్ఫార్మర్ నెపంతో మరో గిరిజనుడు బలి..


Ens Balu
4
Pedabayalu
2020-12-23 16:59:23

విశాఖ మన్యంలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో జరుగుతున్న దమనకాండ కొనసాగుతోంది. నెల రోజుల వ్యవధిలో ఇద్దరి గిరిజనులను మావోయిస్టులు హతమార్చారు. పెదబయలు మండలం, వనగరాయి వద్ద చిక్కుడు సతీష్ అనే గిరిజనుడిని మావోయిస్టులు కిరాతకంగా నరికి చంపడం ఏజెన్సీ వాసులను భయపెడుతోంది. గుత్తికోయల దళం ఈ గిరిజనుడిని చంపినట్టు తెలుస్తోంది. మావోయిస్టుపార్టీలో ప్రజాకోర్టులో విధించే శిక్షలు ఆ విభాగమే చేపడుతోందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జిల్లా పోలీసులకు చిక్కి మావోయిస్టులు, వారి సమాచారం సతీష్ ఇచ్చాడనే కారణంతోనే మావోయిస్టులు హతమార్చినట్టుగా మన్యంలో ప్రచారం జరుగుతోంది. అయితే గిరిజనులను పోలీసుల ఇన్ఫార్మర్ నెపంతో హతమారుస్తున్న తీరును పోలీసులు జిల్లా పోలీసులు కూడా సవాల్ గానే తీసుకున్నారు. మ్రుతుడికి సంబంధించిన వివరాలు, మావోయిస్టుల సమాచారంపై పోలీసు బ్రుందాలు కూడా గట్టిగానే విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది..
సిఫార్సు