గిరిజనులు దళాలరుల బారిన పడొద్దు..
Ens Balu
4
డుంబ్రీగుడ
2020-12-23 15:23:47
డుంబ్రిగూడ మండలం కించుమండ వారాంతపు సంతను రెవెన్యూ డివిజనల్ అధికారిణి కె.లక్ష్మీ శివ జ్యోతి బుధవారం సందర్శించారు. రైతు విక్రయాలకు సంబంధించి ప్రభుత్వ మద్ధతు ధరల పట్టిక అక్కడ లేదని ఆమె గమనించి విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ,పంచాయతి కార్యదర్శి పై ఆగ్రహించి వెంటనే ధరల పట్టిక బోర్డలను పెట్టంచమని ఆదేశించారు. రైతులు పండించిన పంటలను రైతు భరోసా కేంద్రాల లో అమ్మాలని దళారులవద్ద అమ్మి మోసపోవద్దని ఈవిషయంపై రైతులకు అవగాహన కల్పించాలని ఆమె చెప్పారు. అనంతరం అరకు విలేజి (డుంబ్రిగూడ మండలం) 32 ఇళ్ల స్థలాల లే అవుట్ ను పరిశీలించారు. అనంతరం అరకు గ్రామ సచివాలయం (డుంబ్రిగూడ మండలం) తనిఖీచేసారు.ఈ సందర్భంగా ఆమె పంచాయతీ కార్యదర్శి జీవన్ బాబు కు పనితనాన్ని పెంచుకోవాలని పుస్తక (రిజిస్టర్ల) నిర్వహణ సక్రమంగా చేయాలని పెండింగ్ పనులన్ని త్వరగా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.