బోరునీరు కలుషితం..నీరులేక తీరని దాహం..
Ens Balu
3
s.rayavaram
2020-12-23 15:43:12
విశాఖపట్నం జిల్లా, ఎస్.రాయవరం గ్రామ పంచాయతీ శివారు అగ్రహారం గ్రామంలో తాగునీరుకు ఉపయోగించే చేతిబోరు కలుషితం కావడంతో త్రాగు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ బోరు నుంచి వచ్చే నీరు, త్రాగునీటికి పనిచేయడం లేదని గ్రామస్తులు తెలియజేయడంతో ఆ విషయాన్ని సమాచార హక్కు చట్ట కార్యకర్త సోమిరెడ్డి రాజు సచివాలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై గ్రామ సచివాలయ కార్యదర్శి ఎ.వి.యస్.యస్.ప్రసాద్ ఆర్ డబ్ల్యూఎస్ అధికారులతో వెళ్లి నీటిని పరిశీలించారు. నీరు కలుషితం అయిన విషయాన్ని గుర్తించారు. ఈ బోరులోని నీటిని పరీక్షలకు పంపింస్తామని ఫిర్యాదు దారుకు తెలియజేశారు. లేబ్ అధికారులు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా బోరుకు మరమ్మతులు చేయించే ఏర్పాట్లు చేస్తామని సచివాలయ కార్యదర్శి గ్రామస్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ చిన్ని కృష్ణ తదితర సిబ్బంది పాల్గొన్నారు. సచివాలయ సిబ్బంది తక్షణమే త్రాగునీటి సమస్యపై స్పందించడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ, సాధ్యమైనంత త్వరగా బోరునీరు అందుబాటులోకి తీసుకోవాలని కోరారు.