గ్రామ సచివాలయాలతో ఇంటి దగ్గరే సేవలు..
Ens Balu
3
Puritipenta Village Panchayat Office
2020-12-23 17:22:00
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఒక్కొక్కటీ సుమారు రూ.40 లక్షలతో నూతనంగా నిర్మించిన గజపతినగరం-1, పురుటిపెంట-2 గ్రామ సచివాలయ భవనాలను ఆయన బుధవారం ప్రారంభించారు. గజపతినగరం-1 సచివాలయ సిబ్బందితో మంత్రి మాట్లాడుతూ వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకున్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. బీమా సొమ్మును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతీ రైతుకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ బీమా పథకాల అమలును సమీక్షించారు. చేయూతలో విజయనగరం జిల్లా రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో ఉందని, తోడు, బీమా పథకాల్లో రెండో స్థానంలో ఉందని అన్నారు. ఈ నెల 25 లోగా ఈ రెండింటిలో కూడా ప్రధమ స్థానంలోకి రావాలని కోరారు. దీనికోసం సచివాలయ సిబ్బంది మరింతగా కష్టపడి, శతశాతం లక్ష్యాలను సాధించాలని అన్నారు.
ఈ కార్యక్రమాల్లో ఎంపి బెల్లాన చంద్రశేఖర్, ఎంఎల్సీ పి.సురేష్‌బాబు, ఎంఎల్ఏ బొత్స అప్పలనరసయ్య, జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, తాశీల్దార్ ఎం.అరుణకుమారి, ఎంపిడిఓ కె.కిశోర్‌కుమార్, ఎంఇఓ పి.అప్పలనాయుడు, ఇతర అధికారులు, వైఎస్ఆర్‌సిపి నాయకులు పాల్గొన్నారు.