ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తా..
Ens Balu
5
Puttur
2020-12-23 17:43:54
నగిరి నియోజకవర్గంలోని ఆటోకార్మికుల సమస్యలను పరిష్కరించడానికి తనవంతు సహకారం అందిస్తానని ఏపీఐఐసి చైర్ పర్శన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. బుధవారం పుత్తూరు ఆటో కార్మికుల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పుత్తూరు మునిసిపాలిటి పరిధిలో పార్కింగ్ సమస్య పరిష్కారం కోసం మున్సిపల్ కమిషనర్ తో చర్చిస్తామని చెప్పారు. ఆటో కార్మికులకు పార్కింగ్ విషయంలో సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతీ కార్మికుడికి ప్రభుత్వం అండగా వుంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆటోకార్మికులు ఎమ్మేల్యే రోజాను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్. సి.పి నాయకులు జి.బాబు, మురుగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.