అన్నదాతలకు అన్నివిదాలా తోడుంటా..
Ens Balu
2
Nakkapalli
2020-12-23 18:12:01
అన్నదాతలను అన్ని విధాలా ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి దక్కుతుందని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. బుధవారం వేంపాడు, గొడిచెర్ల పిఏసీఎస్ లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయం లో నష్టం వాటిల్లిన రైతులకు వెంటనే నష్ట పరిహారం అందించిన ఘనత మా ప్రభుత్వానిదేనన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వ్యవసాయ లో విప్లవాత్మక మైన మార్పులు తీసుకుని వచ్చిందన్న ఎమ్మెల్యే పంట నష్ట పోతే పది రోజుల్లో నష్ట పరి హారం చెల్లించిన ఘనత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానిదే నన్నారు. మండలం లో నివర్ తుఫాను వచ్చినపుడు నష్ట పోయిన రైతులందరికీ పరిహారం చెల్లించామన్నారు. చంద్ర బాబు హయం లో ఏనాడు రైతులకు నష్ట పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. పదేళ్ల కాలంగా రైతుల కష్టాలు స్వయంగా తెలుసుకున్నాన్నారు. ఉత్తరాంధ్రా సృజల స్రవంతి పోలవరం ప్రాజెక్టు లను 2021 చివరనాటికీ పూర్తి చేసి నీరు అందిస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.