ట్రాన్స్ జండెర్స్ కి పోలీస్ కౌన్సిలింగ్..
Ens Balu
6
Kadapa
2020-12-24 13:57:50
ట్రాఫిక్ లో ట్రాన్స్ జెండర్స్ వాహన చోదకులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కడప సిఐ నాగభూషణం హెచ్చరించారు. గురువారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏఎస్ఆర్ నగర్ లో నివాసం ఉంటున్న ట్రాన్స్ జెండర్స్ కి సిఐ కౌన్సిలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ లో వాహనదారులను ఇబ్బంది పెట్టకూడదని, అసలు ట్రాఫిక్ సమయంలో రోడ్లపైకి రాకూడదన్నారు. అలా కాకుండా పోలీసు హెచ్చరికలను కాదని రోడ్లపైకి వస్తే కేసులు నమోదు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. చాలా మంది వాహన దారుల నుంచి మీపై ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఒకేసారి కేసులు పెడితే ఇబ్బందులు పడతారన్న ఉద్దేశ్యంలో జిల్లా అధికారు ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక కౌన్సిలింగ్ ఏర్పాటు చేసినట్టు సిఐ వివరించారు. ట్రాఫిక్ లో అడ్డంగా నిలబటం ద్వారా కొన్ని సిగ్నల్స్ వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాటిని నియంత్రించేందుకే ముందుస్తుగా తెలియజేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.