స్నేహలత కుటుంబానికి ప్రభుత్వం అండ..
Ens Balu
1
Dharmavaram
2020-12-24 17:43:49
అనంతపురం జిల్లా, ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద బుధవారం హత్యకు గురయిన ఎస్ బి ఐ లో పొరుగు సేవల ఉద్యోగిగా పనిచేసిన స్నేహలత హత్య కు అయిన నేపథ్యంలో మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు స్పష్టంచేశారు. గురువారం అనంతపురం నగరంలోని అశోక్ నగర్ మూడవ క్రాస్ లో నివాసము ఉన్న మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి స్నేహలత మృతదేహానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకు మునుపు మృతురాలి కుటుంబ సభ్యులను కలెక్టర్ ఓదార్చారు. మృతురాలి తల్లిదండ్రుల రోదన, క్షోభ ను చూసి చలించిన కలెక్టర్ మీ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వం అండగా ఉంటుందంటూ వారిలో ఆత్మస్థైర్యాన్ని, భరోసాను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు కల్పిం చారు. జిల్లా కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ (ఆసరా , సంక్షేమం) గంగాధర గౌడ్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి , అనంతపురం రెవెన్యూ డివిజన్ అధికారి గుణ భూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.