ఆలయాలు చర్చిల్లో ఎమ్మెల్యే పూజలు..


Ens Balu
2
Payakaraopeta
2020-12-25 16:31:35

ముక్కోటి ఏకాదశి, క్రిస్మస్ పర్వదినాలను పురస్కరించుకుని విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే , అసెంబ్లీ ఎస్ సి వెల్ఫెర్ కమిటీ చైర్మన్ గొల్ల బాబూరావు శుక్రవారం ఆలయాలు, చర్చిలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  పాయకరావుపేట లో ఎమ్మెల్యే గొల్ల పాండురంగస్వామి ఆలయం, చర్చిలకు వెళ్లి పూజలు, ప్రార్ధనల్లో పాల్గొన్నారు. అటు ఎస్ రాయవరం మండలం చినగుమ్ములూరు లో కూడా చర్చిలో జరిగిన ప్రార్థనలో కూడా ఎమ్మెల్యే పాల్గొన్నారు. భగవంతుని దయ, కృప లతో సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ది చెందుతుందని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం కొన్ని చర్చిల్లో సహవాసులకు చీరలు పంపిణీ చేశారు. దేవుని క్రుపతో మంచి జీవితం గడపాలని కోరుకున్నారు. అదేవిధంగా ప్రజలను పట్టిపీడిస్తున్న కరోనా అంతం కావాలని ముక్కోటి దేవుళ్లకు ప్రార్ధనలు చేసినట్టు ఎమ్మెల్యే వివరించారు.