సీఎం వైఎస్ జగన్ కు రుణపడి ఉంటాం..
Ens Balu
4
జి.మాడుగుల
2020-12-25 20:46:27
నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చారిత్రాత్మకమైనదని, ఇటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన మన ముఖ్యమంత్రి కి ప్రతి నిరుపేద కుటుంబం రుణపడి ఉంటుంది పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన వైయస్సార్ జగన్ అన్న ఇల్లు పట్టాలు పంపిణీ కార్యక్రమం జి.మాడుగుల మండలం లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విశాఖ ఏజెన్సీ 11 మండలాల్లో 26 వేల మంది కుటుంబాలకు కల్పించడం జరిగింది అన్నీ ఆమె అన్నారు. మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళల పక్షపాతిగా ఉంటూ ఇళ్ల పట్టాలు మహిళలు పేరు మీదగా రిజిస్ట్రేషన్ చేయడం అనేది మహిళలకు సమజము లొ గౌరవ పెంచెవిధంగా ఉంటుంది అన్ని అమె ఆన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఇ నిర్ణయం తీసుకోవడం మంచి శుభ పరిణామం అన్నీ ఆమె అన్నారు.జి.మాడుగుల మండలంలో ఒక్కొక్క కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి సేంట్ న్నర భూమి ఇస్తూ త్వరలో ఇక్కడ ఇల్లు నిర్మాణం చేపట్టి నిర్మాణం పూర్తయిన తర్వాత అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యాక్కమలొ పాల్గొన్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజమల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు అందరికీ ఇల్లు కట్టి ఇవ్వడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ప్రాజెక్టు అధికారి వారు తెలిపారు. ఏజెన్సీ 11 మండలాల్లో 26 వేల మందికి ఈ ఇళ్ల పట్టాల పంపిణీ చూస్తున్నము అని తెలిపారు. ఇళ్ల పట్టాలను మహిళలు పేరు మీద ఇస్తున్నామని ప్రాజెక్టు అధికారి వారు తెలిపారు. గత సంవత్సరం నుండి ఏజెన్సీలో ప్రభుత్వ భూములను ఎక్కడున్నావో కనుగొని అక్కడే నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. జి.మాడుగుల మండలం లో ప్రస్తుతం మంజూరు చేసిన ఇళ్ల పట్టాలు స్థలంలో ఆరు నెలల్లో ఇల్లు కట్టించి ఇస్తామని ప్రాజెక్ట్ అధికారి వారు తెలిపారు ప్రతి ఇంటి నిర్మాణం కొరకు ఒక లక్షా ఎనభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ కార్యా క్రమం లో తాసిల్దర్ చిరంజివి పడల్,హౌ సింగ్ డి ఇ బాబు,ఎంపీడీఓ ,పలువురు స్థానిక వైస్సార్ కార్యకర్తలు పాల్గొన్నారు .