బడుగు వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..
Ens Balu
2
Golugonda
2020-12-26 13:50:29
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల లో నవరత్నాలు - పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం రెండవ రోజు శనివారం నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలంలో నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ సొంత ఇల్లు లేని నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గొలుగొండ మండలం గొలుగొండ, కొత్త మల్లంపేట, పాత మల్లం పేట గ్రామ పంచాయతీలకు సంబంధించి వైయస్సార్ జగనన్న కాలనీ లేఅవుట్ల లో ఇళ్ల స్థలాల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో శాసన సభ్యులు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తూ సొంత ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం గావించి మరీ అందిస్తున్నారన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రాష్ట్రవ్యాప్తంగా కుల మతాలు , పార్టీలకతీతంగా అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలను అక్కాచెల్లెళ్ల పేరట
ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారన్నారు. అభివృద్ధి చేసిన లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పన తోపాటు పక్కా ఇళ్ల నిర్మాణాలను కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య, మండల తాసిల్దార్ వెంకటేశ్వరరావు ఇతర రెవెన్యూ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.