నిరుపేదల సొంతింటి కల సాకారం అవుతోంది..


Ens Balu
5
Allavaram
2020-12-26 21:36:20

 రాష్ట్రంలో అర్హులైన ఏ ఒక్కరూ సొంత ఇల్లు లేకుండా వుండకూడదనే ముఖ్య మంత్రి వై .యస్. జగన్ మోహన్ రెడ్డి ఆశయానికి అనుగుణంగా ఈ రోజు రాష్ట్రంలో ప్రతి నిరుపేద సొంత ఇంటి కల నవరత్నాలుపేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా నెరవేరుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. నవరత్నాలుపేదలందరికీ ఇళ్లు కార్యక్రమం లో భాగంగా  శనివారం అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామంలో  అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 4447 మంది నిరుపేద లబ్ధిదారులకు గృహాలను,ఇండ్ల స్థలాల పట్టాలను అమలాపురం పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి చింతా అనూరాధ తో కలిసి మంత్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పంపిణీ చేసి కోటి మంది కలల సాకారం చేశారని మంత్రి చెబుతూ వారందరి కలలు ఈ రోజు వెలుగు చూశాయని మంత్రి అన్నారు. నవరత్నాలు_పేదలందరికీ ఇళ్లు పథకం  అద్భుతమైన పథకమని మంత్రి కొనియాడారు.ఈ ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం రాబోయే 15 రోజులు నిరంతరాయంగా కొనసాగుతుందని ప్రతీ పంచాయితీ లోని లే అవుట్ లను అధికారులు సందర్శించి ఆయ లబ్ధిదారులకు పట్టాలను అందచేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.అమలాపురం పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి చింతా అనూరాధ మాట్లాడుతూ పేద మహిళల కొరకు నిరంతరం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఆయన ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీనీ నెర వేస్తున్నారని 9 పథకా లకు హామీ ఇస్తే 90 కి పైగా పథకాలను అమలు చేస్తున్నారని ఎంపి అన్నారు. ఇళ్ల స్థల పట్టాల పంపణీ ని ఎందరో అడ్డుకున్నపటికిని పేద మహిళల కొరకు ముఖ్యమంత్రి పోరాడి మీ సొంత ఇంటి కల ను ముఖ్యమంత్రి నెరవేర్చారని ఎంపి తెలిపారు. రాబోయే ముప్పయి సంవత్సరాలు కూడా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా కావాలని కోరుకుందాం అని ఎంపి తెలియజేశారు.అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ మాట్లాడుతూ అమలాపురం డివిజన్ లో మొత్తం 14 వేల మంది నిరుపేద లబ్ధిదారులకు వెయ్యి ఎకరాలు ఇండ్ల స్థలాల నిమిత్తం భూ సేకరణ చేయడం జరిగిందని వీరందరికీ పట్టలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పట్టణ నిరుపేదలకు బోడస కుర్రు లో 1632 టిడ్ కో గృహాలను నిర్మించగా మరో 190 మందికి కూడా ఇండ్ల స్థలాల కొరకు స్థల సేకరణ చేయడం జరిగిందని,వీరికి కూడా పట్టాలు ఇస్తున్నామని సబ్ కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అల్లవరం మండలం బోడసకుర్రు లో 1632 మంది లబ్ధిదారుల కొరకు నిర్మించిన టిడ్ కో భవనాలను (51 బ్లాకులు) లబ్ధిదారులకు మంత్రి, ఎంపి అందజేశారు. మొత్తం 33 ఎకరాల విస్తీర్ణంలో టిడ్ కో భవనాలను నిర్మించడం జరిగింది.ఇందులో 300 ఎస్.ఎఫ్.టి తో 672 గృహాలు,365 ఎస్.ఎఫ్.టి తో 128 గృహాలు,అలాగే 430 ఎస్.ఎఫ్.టి తో 832 గృహాలు లబ్ధిదారులకు నిర్మించడం జరిగింది.అలాగే బోడసకుర్రు,వన్నేచింతలపూడి, తాండవపల్లి   గ్రామాలకు చెందిన మునిసిపాలిటీ పరిధిలోని మరో 2815 మంది లబ్ధిదారులకు ఒక సెంట్ చొప్పున ఇండ్ల స్థలాల పట్టాలను కూడా మంత్రి, ఎంపి  పంపిణీ చేశారు.ఇందులో ప్రత్యేకంగా బోడసకుర్రు గ్రామానికి చెందిన 474 మంది లబ్ధిదారులకు ఒక్కొక్క సెంటు చొప్పున (10.60 ఎకరాలు) ఇండ్ల స్థలాల పట్టాలను మంత్రి, ఎంపి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్,మునిసిపల్ కమీషనర్ వి.ఐ.పి.నాయుడు,హౌసింగ్ ఇ.ఇ. గణపతి,పట్టణ నాయకులు మట్ట పర్తి నాగేంద్ర, చెల్లు బోయిన శ్రీనివాస్, ఒంటెద్దు వెంకన్నా యుడు,షేక్ అబ్దుల్ ఖాదర్,మట్టపర్తి మురళీ కృష్ణ, గనిసెట్టి రమనలాల్, ఉండ్రు వెంకటేష్, నాగారపు వెంకటేశ్వరరావు, గొవ్వాల రాజేష్, కట్టోజు రాము, సంసాని బులినాని,కరెళ్ల రమేష్ బాబు,కర్రి వెంకట రామరాజు, పిచ్చిక శాంతి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.