నిరుపేదల కష్టాలు తీర్చుతున్న దేవుడు సీఎం వైఎస జగన్..
Ens Balu
3
Ravikamatham
2020-12-26 21:42:38
సొంత ఇల్లు లేని ప్రతీ నిరుపేద అక్కాచెల్లెమ్మల కు సొంత ఇంటి కల సౌకర్యాన్ని కల్పించి వారి ముఖాలలో చిరునవ్వులను చూడటమే మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని చోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ అన్నారు. నవరత్నాలు- వైయస్సార్ జగనన్న ఇళ్ల పట్టాలు కార్యక్రమం రెండో రోజు శనివారం చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం చిన పాచిల, కొమిర , గుమ్మళ్ళపాడు ,మత్స్య పురం, కె బి పి అగ్రహారం ,బుడ్డి బంద, కవ్వగుంట గ్రామ పంచాయతీలకు, రోలుగుంట మండలం వడ్డీప , బుచ్చింపేట, రత్నం పేట, బిబి పట్నం, ఎంకే పట్నం, ఆర్ల , రాజన్నపేట గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణాలకు అర్హులైన నిరుపేద లబ్ధిదారులకు ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ పేద ప్రజల ఆశాజ్యోతి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు నవరత్నాలు అమలుకు సంబంధించి తన పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, మాట తప్పని, మడమ తిప్పని నేత మన జగనన్న అనీ, ఆయన చెప్పినట్లే సొంత ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇంటి స్థలాన్ని ఇస్తూ సొంత ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో రావికమతం, రోలుగుంట మండలాల తాసిల్దార్ లు పీ కనకారావు, కృష్ణమూర్తి ఇతర రెవెన్యూ అధికారులు , సిబ్బంది హాజరయ్యారు.