నిరుపేదల పాలిట వరం జగనన్న ఇళ్లు..


Ens Balu
2
Malikipuram
2020-12-27 21:38:46

రాష్ట్రంలో నిరుపేదలందరికీ ముఖ్యమంత్రి ఇస్తున్న ఇళ్లు వరమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి చెల్లు బోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు.   నవరత్నాలుపేదలందరికీ ఇళ్లు కార్యక్రమం లో భాగంగా ఆదివారం మంత్రి మల్కిపురం మండలం శంకర గుప్తం గ్రామంలో 241 మంది నిరుపేద మహిళలకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సొంత ఇంటి కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెరవేర్చారని ఇది ఆయన ఒక్కడికే సాధ్యమని మంత్రి చెబుతూ నిరుపేదలందరికీ ఇండ్ల స్థలాల పట్టాలను ఇవ్వడం ద్వారా ప్రతి నిరుపేదకు ఆస్తిని ముఖ్యమంత్రి కల్పించారని దీనిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.ప్రతీ నిరుపేదకు సొంత ఇల్లు వుండాలనే లక్ష్యం తో ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల ఇండ్ల స్థలాల పట్టాలను నిరుపేద మహిళలకు పంపిణీ చేశారని,ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమని మంత్రి కొనియాడారు.ముఖ్యమంత్రి ఆశించిన విధంగా ప్రతీ నిరుపేద సొంత ఇంటి ని నిర్మించు కోవాలని మంత్రి తెలియ చేసారు.జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ  నవరత్నాలుపేదలందరికీ ఇళ్లు కార్యక్రమం లో భాగంగా జిల్లాలో మూడు లక్షల 84 వేల మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయడం జరిగిందని,అలాగే 1 లక్ష 50 వేలు గృహాలు మంజూరు చేయడం జరిగిందని  అన్నారు. ప్రతీ నిరుపేదకు ఇంటి స్థల పట్టా ఇవ్వటమే కాకుండా వారికి పొజిషన్ కూడా చూపించడం జరుగుతుందని ముఖ్య మంత్రి ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతీ నిరుపేద సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ సూచించారు. అలాగే ఇంటి నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి మూడు ఆప్షన్లు ఇవ్వడం జరిగిందని లబ్ధిదారులు తమకు నచ్చిన ఆప్షన్ ను ఎంపిక చేసుకొని ఇంటిని నిర్మించుకోవచ్చునని కలెక్టర్ తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు  కౌశిక్, ఎస్.సి మాల కార్పోరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి పెదపాటి అమ్మాజీ,రాజోలు శాసన సభ్యులు రాపాక వరప్రసాదరావు,తదితరులు పాల్గొన్నారు.