వైఎస్సార్సీపీ ప్రభుత్వంతోనే పేదోడికి సొంత గూడు..


Ens Balu
1
Uppalaguptam
2020-12-27 21:40:37

రాష్ట్రం లో ప్రతీ నిరుపేద సొంత ఇంటి కల కేవలం ముఖ్య మంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఆదివారం ఉప్పలగుప్తం మండలం కిత్తన చెరువు గ్రామంలో మండల పరిధిలోని రెండు వేల 329 మంది నిరుపేద  లబ్ధిదారులకు మంత్రి ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. అలాగే కిత్త నచెరువు గ్రామానికి చెందిన 135 మంది నిరుపేదలకు జగనన్న కాలనీ లో 2 కోట్ల 45 లక్షల తో నూతనంగా నిర్మించే ఇళ్ళ నిర్మాణానికి కూడా మంత్రి శంఖుస్థాపన చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుపేద సొంత ఇల్లు లేకుండా ఉండకూడదనేది ముఖ్యమంత్రి లక్ష్యమని ఈ ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల ఇళ్ళ పట్టాలను నిరుపేదలకు పంపిణీ చేశారని,ఇది కనీ, వినీ ఎరుగని చారిత్రాత్మక సంఘటన అని మంత్రి అభివర్ణించారు. ఇంటి నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి మూడు ఆప్షన్లు ఇచ్చారని వీటిలో లబ్ధిదారులు తమకు నచ్చిన ఆప్షన్ ను ఎంపిక చేసుకొని ఇంటిని నిర్మించు కోవచ్చునని మంత్రి తెలిపారు.ఇళ్ళ స్థలాల పట్టాలను నిరుపేదలకు ఇవ్వడం ద్వారా వారి కళ్లలో ఆనందాన్ని,వెలుగును ముఖ్య మంత్రి నింపారని మంత్రి తెలియ చేస్తూ పేదలందరి తరపున మంత్రి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్రి బాబ్జీ,అమలాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ బొక్కా ఆదినారాయణ, డా. పినిపే  శ్రీకాంత్, చెల్లు బోయిన శ్రీనివాస్, మోటూరి సాయి, దంగేటి రాంబాబు, దంగేటి దొరబాబు,గెడ్డం సంపత్ కుమార్, జిన్నూరి వెంకటేశ్వరరావు,వంగా గిరిజ, గృహ నిర్మాణ శాఖ ఇ. ఇ. గణపతి, డి.ఇ.ఇ. నాగలక్ష్మి ఎం.పి.డి.ఓ. కె.విజయప్రసాద్,డిప్యూటీ తహసీల్దార్ ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.