పేదలకు గూడు కల్పించిన ప్రభుత్వం తమదే..


Ens Balu
2
అరకు
2020-12-28 19:11:25

ఆంధ్రప్రదేశ్ లో గూడు లేని పేదలకు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అందరికీ ఇళ్లు, పట్టాలు మంజూరు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికే దక్కుతుందని అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ అన్నారు.  సోమవారం డుంబ్రిగూడ మండలం అరకు గ్రామంలో  తహశీల్దార్ జయప్రకాష్ (డుంబ్రిగూడ మండలం)తో కాలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు మాట్లాడుతూ ఇళ్ల పండుగ జరుపుకుంటున్నామని  అర్హత వున్న అందరూ దరఖాస్తు చేసుకొని లబ్ది పొందాలని అన్నారు. లబ్ధిదారులు కురిడి స్వర్ణలత, పోతంగి గ్రామం, డుంబ్రిగూడ మండలం  మాట్లాడుతూ జగనన్న ముఖ్య మంత్రి కాకముందు ప్రకటించిన వన్నీ, మాట తప్పకుండా అమలు  పేదలందరం నెల తిరిగేసరికి అద్దె కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని, ఆ బాధ ఇంక లేదని, పేదవారికి అందరికి ఇళ్లు ఇస్తున్నారని, మా ఆనందం చెప్పలేనిదని, జగనన్న  కి ఋణపడి వుంటామని అన్నారు. గిరిజన  ప్రాంతాలలో వున్న  నాయకులు మరియు అధికారులు మా గురించి శ్రమిస్తున్నారని  అందరికీ ఆమె ధన్యవాదాలు తెలియజేశింది. ఈ కార్యక్రమం లో  ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
సిఫార్సు