పేదల తలరాత మార్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ దే..
Ens Balu
4
Bheemili
2020-12-28 20:16:04
విశాఖపట్నం జిల్లా భీమిలీ నియోజకవర్గం భీమిలీ మండలంలో సోమవారం నవరత్నాలు పథకాలలో పేదలందరికి ఇల్లు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొని వై యస్ ఆర్ జగనన్న కాలనీలకు శంకుస్థాపన చేశారు. అనంతరం పేద ప్రజలకు ఇండ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. భీమిలీ మండలంలోని అన్నవరం, అమనం, పెదనాగమయపాలెం, చిప్పాడ, తాళ్లవలస గ్రామాల్లో వెయ్యికి పైగా లబ్దిదారులకు మంత్రి చేతుల మీదగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, ఆర్డీవో కిషోర్, భీమిలీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెదబాబు, మండల స్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారులు, వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అమనాం గ్రామంలో రూ. ఎనిమిది కోట్ల కు పైగా ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు, చేపట్టడం జరిగింది. పెదనాగమయ పాలెం లో ప్రతి వారం అధికారులు , నాయకులు సమావేశం నిర్వహించి..స్థానిక సమస్యలను పరిష్కరించాలని అన్నారు. పింఛన్లు రాని వారు ఎవరైనా ఉన్నా, సదరం సర్టిఫికెట్లు ఇంకా ఎవరికైనా రావాల్సి ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మత్యకారుల కష్టాలను చూసి కార్పొరేషన్ చైర్మన్ ని నియమించారని, అంతేకాకుండా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఒక సంవత్సరం లోనే మత్యకారులకు నాలుగు పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. భీమిలీలో ఉన్న మత్యకారులు వేటకు వెళ్ల వచ్చని అన్నారు. తమ ప్రభుత్వం కుల, మత, వర్గ వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని అన్నారు. మత్యకారులు మంచి వ్యాపార వేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు చదువుకొని విద్యావంతులు కావాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళ పక్షపాతి అని అన్నారు. ఇల్లు లేని నిరు పేదలకు స్థలం కొని ఇస్తూ, ఇల్లు కూడ కట్టించి ఇస్తున్నామని, పూర్తి పారదర్శకతతో ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని అన్నారు. అర్హత ఉండి ఇళ్ల పట్టా రాకపోతే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇళ్ల పట్టా అందిస్తాం అని పేర్కొన్నారు. అవి కాలనీలు కాదు.. ఊళ్ళు రాబోతున్నాయి. ఇల్లు కట్టించి ఇవ్వడంమే కాదు, త్రాగు నీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి సదుపాయాలు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. తమ పాదయాత్రలో సమస్యలు తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు రూపంలో పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు.