తాండవ చక్కెర కర్మాగారంలో క్రషింగ్ ప్రారంభం..


Ens Balu
2
Payakaraopeta
2020-12-28 20:35:30

ఆంధ్రప్రదేశ్ లో చక్కెర పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేసి చెరకు రైతులను ఆదుకున్న ఘనత సీఎం వై ఎస్ జగన్ కు దక్కుతుందని పాయరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. సోమవారం తాండవ షుగర్ ఫ్యాక్టరీ లో చెరకు క్రషింగ్ ను  ఎమ్మెల్యే,  గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు లు ప్రారంభించారు.  సోమవారం ఫ్యాక్టరీ ఆవరణలో   బోయిలర్ వద్ద శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు చేసి లాంఛనంగా క్రషింగ్ ను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాయలా పడ్డ చక్కెర కర్మాగారాలను సైతం మళ్లి తిరిగిరి నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మంత్రులో హైలెవల్ కమిటీని ఏర్పాటు చేసి పరిశీలన చేయించిందన్నారు. త్వరాలోనే చక్కెర కర్మాగారాలను ఆధునీకరించి ఉత్పత్తి రెండింతలు చేసే దిశగా ప్రభుత్యం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు నష్టపోకుండా వారికి మద్దతు ధర కల్పించడంతో పాటు చెరకు కాటాల నుంచి కర్మాగారానికి తోలిన సరుకుకు తక్షణమే బకాయిలు చెల్లించాలని కర్మాగారం అధికారులను ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో చక్కెర కర్మాగారం అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు