వైఎస్సార్సీపీతోనే పేదివాడి గూడు సాకారం..
Ens Balu
3
గొడిచర్ల
2020-12-28 20:49:25
ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నేర వేర్చి ప్రభుత్వ ఖర్చుతో స్థలం ఇల్లు నిర్మించి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దే నని పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. సోమవారం ఆయన దేవవరం గొడిచెర్ల డొంకడా జగన్నాధపురం గ్రామాల్లో 329 మంది లబ్ది దారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అలాగే ఇళ్ల నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గం లో 9239 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మిస్తున్నామన్నారు. ఇల్లు నిర్మాణం కోసం 1.80 లక్షలు ప్రభుత్వమే ఇస్తుంది అని చెప్పారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.వచ్చే నెలలో అమ్మ వడి రెండో విడత జమ చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి జగనన్న కారణ జన్ము డన్నారు. నిరంతరం పేదల కోసమే తపిస్తున్నారన్నారు. ప్రజల ఆరాధ్య దైవమన్నారు. ఎన్నికల ముందునిచిన హామీలు నేర వేరుస్తున్నామన్నారు.ఈ రోజు ఇళ్ల స్థలాలు లేనివారికి దరఖాస్తు చేస్తే 90 రోజుల్లో ఇస్తామన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న జె సి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 1.15 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు 103 కోట్లు ఖర్చు చేశామన్నారు.