సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పరిపాలన..
Ens Balu
3
Nathavaram
2020-12-28 20:56:00
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ప్రతి ఒక్కరి అవసరాలను అడగకుండానే నేరుగా వారి గడప వద్దకే చేర్చుతున్న ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేనని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం లో భాగంగా సోమవారం నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చిన్న జగ్గంపేట, గుమ్మడి కొండ , గాంధీనగరం , ఎం బి పట్నం, వై డి పేట, ఏపీ పురం, శృంగవరం గ్రామాలలో సొంత ఇల్లు లేని నిరుపేద లబ్ధిదారులకు శాసనసభ్యులు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తూ ఇప్పటికీ 22 రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి అంద చేస్తున్నారన్నారు. రాబోయే నూతన సంవత్సరం , సంక్రాంతి కానుకగా అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు చూడాలని మన ముఖ్యమంత్రి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో నాతవరం తాసిల్దార్ జానకమ్మ, ఇతర రెవెన్యూ అధికారులు సిబ్బంది హాజరయ్యారు. అటు నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం బయ్య వరం, ఎన్ ఆర్ పేట, లచ్చన్న పాలెం, గిడుతూరు, మల్లవరం గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు తాసిల్దార్ రాణి అమ్మాజీ ఇళ్ల స్థల పట్టాలను పంపిణీ చేశారు.