పేదల సొంతింటి కల నెరవేరిన వేళ..
Ens Balu
8
Chinthapally Village
2020-12-29 15:34:08
పేదల సొంత ఇంటి కలను రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని పాడేరు శాసన సభ్యురాలు శ్రీమతి కొట్టగుళ్లిభాగ్యాలక్షి అన్నారు. మంగళవారం చింతపల్లి మండలం అన్నవరం గ్రామంలో జరిగిన నవరత్నాలులో భాగంగా పేదలందరికి ఇళ్ళు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో 26వేల మంది ఇళ్లు లేని పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారుల అభీష్టం మేరకే ఇల్లు నిర్మిస్తామని అన్నారు. సొంత ఇల్లు లేక అవస్థలు పడే వారికి సొంత ఇంటి హక్కులు ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. మహిళలు పేరుమీద రిజిస్ట్రేషన్ చేస్తామని అన్నారు. ప్రతీ పధకంలో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తున్నామని చెప్పారు. మహిళలు చేయూతను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వై ఎస్ ఆర్ ఆసరా ద్వారా రుణ మాఫీ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జగనన్న కాలనీలలో అన్నిమౌళిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.
ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనా విధానమే నేటి పట్టాలు పంపిణీ అని అన్నారు. ఇళ్ళ స్థలాలు పంపిణీ పేదలకు ముఖ్యమంత్రి ఇచ్చిన వరమని పేర్కొన్నారు. గతంలో ఆర్వో ఎఫ్ ఆర్ పట్టాలు పంపిణీ చేశామని నేడు ఇళ్ళపట్టాలు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు.జాన్ నుంచి ఇళ్ల నిర్మాణాలు చేపడతామని అన్నారు. ప్రభుత్వం రైతు భరోసా, చేయూత, ఆసరా, బీమా ,అమ్మఒడి వంటి పధకాలు అమలు చేస్తోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రూ.500కోట్లతో పాడేరు లో మెడికల్ కళాశాల,రూ.35కోట్లతో సీసీరోడ్లు,బిటి రోడ్లు మంజూరు చేశామని చెప్పారు.కాఫీ రైతులకు చింతపల్లి లో మాక్స్ సంస్థ ఏర్పాటు చేశామని అన్నారు. రాగులు, ధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లిస్తోందని అన్నారు.అనంతరం 98 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణి చేసారు. ఈకార్యక్రమంలో మార్కేట్ కమిటీ అధ్యక్షులు జల్లి హలియ రాణి, తహసీల్దార్ గోపాల కృష్ణ, ఎంపిడివో ఉషశ్రీ ,హౌసింగ్ డీఈఈ బాబు,స్థానిక నేతలు జల్లి సుధాకర్, మోరి రవి తదితరులు పాల్గొన్నారు.