90 రోజుల్లో నిరుపేదలకు సొంతిల్లు..
Ens Balu
2
Kasimkota
2020-12-29 15:44:53
ఆంధ్రప్రదేశ్ లో ఏఒక్క నిరుపేదకు ఇళ్లు లేకుండా ఉండకూడదనే లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతీ పేదవాడికి ఇళ్లు మంజూరు చేస్తున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నానాధ్ అన్నారు. మంగళవారం కశింకోట మండలం, తీడ, సుందరయ్యపేట, అచ్చెర్ల, భీమవరం గ్రామాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హులైన నిరుపేదలు ఎవరైనా దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి స్థలంతోపాటు, ఇల్లు కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. తొలి విడతగా ఇచ్చే ఇళ్ల పట్టాలు కేవలం కాదని ఇది నిరంతర ప్రక్రియగా కొగనాసాతుందన్నారు. ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు గొల్లవిల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో నాలుగు గ్రామాలలో 424 మంది పేదవారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మళ్ళ బుల్లిబాబు, దంతులూరి శ్రీధర్ రాజు, చిలికి సత్తిబాబు, దొంగల నాయుడు, రెడ్డి ఎర్రన్నాయుడు, బండారు వాసు, అప్పలనాయుడు, అచ్చెన్నాయుడు, వెంకట్, కరణం పద్మ, శంకర్, సోమేశ్, రమేష్, నిమ్మదల సన్యాసినాయుడు, ఆర్డీవో సీతారాం గారు, పట్టా లబ్ధిదారులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.