ఉత్సాహంగా ఇళ్ట పట్టాల పండుగ..
Ens Balu
3
Narsipatnam
2020-12-29 15:53:05
నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం లో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం మండలం ధర్మసాగరం గ్రామపంచాయతీలో జరిగిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందని ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరుగుతుందన్నారు. నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించడం జరుగుతుందని , అర్హులై ఉండి పేర్లు లేని వారు ఎవరైనా ఉంటే వారు సంబంధిత గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని వాటిని పరిశీలించి అర్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ జయ, రెవిన్యూ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. అటు మాకవరపాలెం మండలం తాసిల్దార్ రాణి అమ్మాజీ , రెవెన్యూ అధికారులు పి పి అగ్రహారం , జంగాలపల్లి గ్రామ పంచాయతీలలో లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ గావించారు. ఇటు నాతవరం మండలం చమ్మచింత గ్రామ పంచాయతీలో మండల తాసిల్దార్ జానకమ్మ లబ్ధిదారులకు ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.