పర్యావరణాన్ని మనమే పరిరక్షించుకోవాలి..


Ens Balu
2
Chinthapalli
2020-12-29 17:37:45

పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపైన ఉందని పాడేరు  శాసన సభ్యురాలు కొట్టగిల్లి భాగ్యలక్ష్మి  అన్నారు.స్థానిక లంబసింగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని పర్యాటక ప్రాంతాల్లో  పారిశుధ్యం, కాలుష్య నివారణపై ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి స్థానిక  రిసార్టులు యజమానులు, స్థానిక గిరిజనులు, గ్రామ వలంటీర్లు తో అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. పర్యాటకులను ప్రోత్సాహిస్తామని, కానీ పర్యాటకులు భాద్యతలు మర్చి పోతున్నారన్నారు. ప్లాస్టిక్ నియంత్రణ చేయాలన్నారు. అడ్డాకులను వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్ కొండమీదకు రాకూడన్నారు. వందన్ వికాస కేంద్రాలద్వారా గుడ్డ సంచులు తయారు చేయాలన్నారు. పర్యాటక ప్రాంతంలో గిరిజన సాంప్రదాయ వంటకాలు రుచి చూపించాలన్నారు.  వంజంగి హిల్స్కు పర్యాటకుల తాకిడి పెరిగిందన్నారు. అక్కడ నకిలీవస్తువులు విక్రయాలు జరుగుతున్నాయన్నారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్ సలిజామల మాట్లాడుతూపర్యాటకుల తాకిడి పెరిగింది, పర్యాటకుల వలన శబ్దకాలుష్యం, వాయు కాలుష్యం పెరుగుతున్నదని అన్నారు.ప్లాస్టిక్ ని నిరోదించకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తు తాయని అన్నారు. పర్యాటకుల  వాహనాలు నిలుపుదలకు ప్రైవేట్ స్థలాన్ని సేకరించాలని అన్నారు. పర్యాటక ప్రాంతంలో రిసార్టులు నిర్మిస్తే పంచాయతీ అనుమతులు పొందాలన్నారు. పర్యటకాన్ని రెగ్యులరైజ్ చేయవలసి ఉందన్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు దుకాణాలు తెరవకూడదన్నారు. పోలీసులకు తగు సూచనలు చేశారు. డస్ట్ బిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. దుకాణ యజమానులు డస్ట్ బిన్ పెట్టకపోతే దుకాణాలు మూయిస్తామని హెచ్చరించారు.   తాగు నీటి సదుపాయం కల్పిస్తామని అన్నారు. ప్రజలనుంచి కాలుష్య నివారణపై అభిప్రాయం సేకరించారు. లంబసింగి నుంచి చేరువులవేనం వరకు రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరారు.చెత్త కుండీలు, పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలన్నారు. తాగునీటి సదుపాయాలు కల్పించాలని కోరారు.పబ్లిక్ టాయిలెట్లు నిర్మిస్తామన్నారు.వారపు సంతల్లో ప్లాస్టిక్ నిరోధించాలని పిఓ సూచించారు.పంచాయతీ తీర్మానం చేయాలన్నారు. ప్లాస్టిక్ అమ్మేవారి నుంచి అపరాధ రుసుము వసూళ్లు చేయాలన్నారు. ప్రైవేట్ వ్యక్తులు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకుంటే అనుమతులు ఇస్తామని పీవో సూచించారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటి అధ్యక్షురాలు జల్లి హాలియా రాణి,గిరిజన సంక్షేమశాఖ ఉపసంచాలకులు జి.విజయకుమార్, జిల్లా పర్యాటక అధికారి పూర్ణిమా దేవి, తహసీల్దార్ గోపాలకృష్ణ, ఎంపిడిఓ ఉషశ్రీ ,టూరిజం మేనేజర్ అప్పలనాయుడు,సామాజిక కార్యకర్త  సోహల్, పోలీస్ అధికారులు, రిసార్టులు యజమానులు ,స్థానిక ప్రజలు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు