పేదల సంక్షేమం సీఎం వైఎస్ జగన్ విశేష క్రుషి..


Ens Balu
3
Karveti Nagar
2020-12-29 18:53:52

పేదలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కుల మతరహితంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగరం మండలంలోని కత్తెరపల్లి  లో నేడు ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త తో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు మేరకు అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో అత్యంత కృషి చేస్తున్నారని ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని పథకాలు ప్రజల్లోకి గ్రామ సచివాలయాల ద్వారా అమలు చేయించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకొంటున్నారన్నారు.ప్రజా సంకల్ప పాదయాత్రలో మద్యపాన నిషేధం తో పాటు డ్వాక్రా రుణాలను విడతల వారీగా మాఫీ చేస్తూ ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తున్నారన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ళు పట్టాలతో పాటు ఇళ్లను నిర్మించే పనిని ప్రభుత్వం చేపట్టిందన్నారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్త  మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం 2.6 లక్షల మందికి పట్టాలు ఇవ్వడం జరుగుతోందని అయితే అర్హత గల లబ్ధిదారులు వున్నంతకాలం ఇది నిరంతర ప్రక్రియ అన్నారు.ప్రభుత్వం ఎవరికైనా పథకాలను ఇవ్వడానికి ఉంది తప్పపథకాలను తీసి వేయడానికి కాదని అన్నారు.ప్రభుత్వం ప్రస్తుతం ఇళ్ల నిర్మాణ విషయంలో నిబద్ధత తో పనిచేస్తోందని వీలైనంత తొందరగా మంజూరైన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు.ఈ సందర్భంగా పలువురు మహిళల కు పట్టాలను పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి,జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్త తో పాటు పలువురు అధికారులు అనధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు