చేనేత కార్మికులకు ప్రభుత్వం పూర్తిస్థాయి భరోసా..
Ens Balu
3
Amalapuram
2020-12-30 16:55:24
రాష్ట్రం లో చేనేత,సహకార రాంగాలను బ్రతికించి తద్వారా చేనేత కుటుంబాలను ఆదుకుంది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. బుదవారం అమలాపురం రూరల్ మండలం బండారు లంక లో 72 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 50 వేలు చొప్పున 36 లక్షలు ముద్ర రుణాలను మంత్రి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సహకార రంగాన్ని అభివృద్ధి చేసి సహకార సంఘాల ద్వారా చేనేత పనివారికి రుణాలు ఇచ్చి ఆదుకుంది ఆ నాటి ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి అని,చెబుతూ తండ్రిని మించిన తనయుడు గా అంతకు మించిన సహాయ సహకారాలను చేనేత కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్నారని మంత్రి తెలిపారు.2014 నుండి 2019 వరకు బండారులంక గ్రామం ఏ విధంగాను అభివృద్ధికి నోచుకోలేదని, ఏ కొత్త పథకం రాలేదని 2009 నుండి 2014 వరకూ తాను శాసన సభ్యునిగా,మంత్రిగా బండారులంకలో కోట్లాది రూపాయల తో రహదారులు,డ్రెయిన్లు నిర్మించానని మంత్రి తెలిపారు.
అభివృద్ధిలో రాజశేఖర్ రెడ్డి రెండు అడుగులు వేస్తే జగన్ మోహన్ రెడ్డి నాలుగు అడుగులు వేస్తున్నారని,బండారులంకలో 900 మందికి ముఖ్యమంత్రి చేయూత ద్వారా పెన్షన్లు ఇస్తున్నారని,గతంలో బండారు లంక లో ఏ ఒక్కరికీ ఇంటి పట్టా ఎవ్వరూ ఇవ్వలేదని, ఒక్క నిరుపేద చేనేత కుటుంబాల సొంత ఇల్లు లేక ఎన్ని కష్టాలు పడుతున్నారో స్వయంగా నేను చూశానని, ఈ రోజు బండారు లంక లో 290 మందికి ఇండ్ల స్థలాల పట్టాలను ముఖ్య మంత్రి ఇచ్చారని,మీరు ఇళ్లు కట్టుకుంటే మరో లక్షా 80 వేలు ముఖ్యమంత్రి ఇస్తారని,కట్టుకోలేమంటే ముఖ్యమంత్రే ఉచితంగా కట్టించి ఇస్తారని మంత్రి తెలిపారు.మొత్తం 475 మందికి బండారు లంక లో ఇళ్లు ఇస్తున్నట్లు మంత్రి తెలియ చేసారు.అలాగే బండారులంక లో 11 వందలమంది కి అమ్మఒడి పథకం అమలు చేస్తున్నారని,సంక్రాంతి కానుకగా జనవరి 9 వ తేదీన మరోసారి ఈ 11 వందలమందికి అమ్మఒడి ని ముఖ్య మంత్రి ఇస్తున్నారని మంత్రి తెలియచేశారు.అంతేకాకుండా తల్లిదండ్రులకు భారం కాకుండా పిల్లలకు పుస్తకాలు,బాగ్ లు షూస్,బెల్టులు అన్ని ఉచితంగా ముఖ్య మంత్రి ఇస్తున్నారని మంత్రి తెలిపారు.
ఇంటర్మీడియేట్ వరకు ముఖ్యమంత్రి పిల్లలకు అమ్మఒడి,ఆతరువాత ఫీజ్ రీింబర్స్మెంట్ ను ముఖ్యమంత్రి ఇస్తున్నారని మంత్రి తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత మరియు ఔళి శాఖ సహాయ సంచాలకులు ఎన్.ఎస్ కృపావరం,సహాయ అభివృద్ది అధికారులు రజనీకాంత్,సూరిబాబు,ఎం.పి.డి.ఓ.ప్రభాకరరావు,పంచాయితీ కార్యదర్శి జి.నారాయణరావు,ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ ఎన్.అభినవ్, చెల్లు బోయిన శ్రీనివాస్, కుడుపూడి వేంకటేశ్వర(బాబు), బొంతు గోవింద శెట్టి, జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు కామి శెట్టి శ్రీనివాసరావు,రాష్ట్ర చేనేత విభాగం సంయుక్త కార్యదర్శి జాన గణేష్, సరె ళ్ళ రామకృష్ణ, కండెబోయిన వెంకటేశ్వరరావు, పిచ్చిక శాంతి ప్రభాకర్, కరెళ్ళ రమేష్,పి.ఎ.సి.ఎస్. అధ్యక్షులు దంగేటి బుల్లి అబ్బులు,కారుపర్తి నాగమల్లేశ్వరావు, సమయమంతుల రామం, భోజనపల్లి గణేష్,వాసా దొరబాబు,ముషిని నాగరాజు, పెనుమాల సునీత,గోసంగి సుశీల,చందన శంకర్రావు, చింతా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.